JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 05 July 2026, 10:18 pm Posted by : JANA SANGARSHANA

ఉమ్మడి కోటగిరి పోతంగల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పి.కృష్ణ ,ఉపాధ్యక్షులుగా సైదయ్య

 

కోటగిరి: ఉమ్మడి కోటగిరి పోతంగల్ మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పి.కృష్ణ (V6 వెలుగు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో పాత కార్యవర్గాన్ని రద్దుచేసి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుల్కంటి కృష్ణ కుమార్ (V6 వెలుగు), ఉపాధ్యక్షుడిగా పుప్పల సైదయ్య ( తెలంగాణ పత్రిక), ప్రధాన కార్యదర్శిగా బి.సాయిలు (ప్రభ న్యూస్), కోశాధికారిగా గాయక్వాడ్ రాము (జనం సాక్షి), సహాయ కార్యదర్శిగా పి.పెంటయ్య (ఆంధ్ర ప్రభ), ముఖ్య సలహాదారుగా రాజు (అక్షర టుడే),బేగరి రాములు (పోరు న్యూస్),గౌరవ అధ్యక్షులుగా గోగినేని హన్మంత్ రావు ( జ్ఞాన తెలంగాణ), సాయిబాబా గౌడ్ ( భారతి డిజిటల్ న్యూస్) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కాసుల శ్రీకాంత్(నవతెలంగాణ),గంగాధర్,ఎడ్డెడి.అనిల్ ( ప్రజావాణి),పబ్బ నవీన్ ( నమస్తే ఇందూరు వార్త)హైమద్ ( ఆజ్ కా తెలంగాణ ),వి.నరేష్ (సమయం), గంట్ల రాజు (మనతెలంగాణ) తదితరులు పాల్గొన్నారు.