JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 11:45 am Posted by : JANA SANGARSHANA

కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కొత్త సీఐగా జి.విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

 

కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కొత్త సీఐగా జి.విజయ్ కుమార్ బాధ్యతల స్వీకరణ

– గతంలో ఇదే పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా సేవలు

– ఇప్పుడు సీఐగా తిరిగి రాక

 

 

 

సైబరాబాద్ ,కూకట్పల్లి ప్రతినిధి అంజిబాబు, జూలై 17 : కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ కి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా జి. విజయ్ కుమార్ శుక్రవారం రోజు బాధ్యతలు స్వీకరించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన అధికారుల బదిలీల్లో భాగంగా ఈ నియామకం జరిగింది. “ఇప్పటివరకు కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ సీఐగా విధులు నిర్వహించిన రాజశేఖర్ రెడ్డిని మాదాపూర్ ట్రాఫిక్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జి. విజయ్ కుమార్ కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ లో సీఐగా బాధ్యతలు చేపట్టారు. కాగా, జి.విజయ్ కుమార్ గతంలో ఇదే కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్లో సబ్డిన్స్పెక్టర్ (ఎస్ఐ)గా విధులు నిర్వహించి ప్రజలకు చేరువైన అధికారిగా గుర్తింపు పొందారు. అదే పోలీస్ స్టేషన్ కి ఇప్పుడు సీఐ హోదాలో తిరిగి రావడం విశేషంగా మారింది. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. బాధ్యతలు స్వీకరించిన విజయ్ కుమార్ కి పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.