♦ బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తరలిరావాలి: సుజాతనగర్ మండల అధ్యక్షుడు లావుడ్యా సత్యనారాయణ నాయక్
♦ సుజాతనగర్‌లో BRS జెండా ఆవిష్కరణలు & సభ: ముఖ్య అతిథులుగా ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా
సుజాతనగర్ మండలంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ పర్యటన మరియు బహిరంగ సభ నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ ఎంపీ, బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శ్రీ వద్దిరాజు రవిచంద్ర గారు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు హాజరుకానున్నారు.
ఈ పర్యటనలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మెలను ఆవిష్కరించనున్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా పలువురి చేరికలను స్వాగతించి, ఆ తర్వాత ఏర్పాటు చేసే బహిరంగ సభలో నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు.
కార్యక్రమ షెడ్యూల్ ప్రకారం, సాయంత్రం 4:30 గంటలకు సింగభూపాలెం గ్రామంలో ప్రథమంగా పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు కొత్త అంజానాపురం గ్రామానికి చేరుకుని, అక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 6:00 గంటలకు రూప్ల తండాలో జెండా ఆవిష్కరణతో పాటు, ఏర్పాటు చేసిన ముఖ్యమైన బహిరంగ సభలో ముఖ్య అతిథులు పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమాలను పురస్కరించుకుని బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు ప్రజాప్రతినిధులు అత్యధిక సంఖ్యలో పాల్గొని పర్యటనను జయప్రదం చేయాలని బిఆర్ఎస్ పార్టీ సుజాతనగర్ మండల కమిటీ అధ్యక్షులు శ్రీ లావుడ్యా సత్యనారాయణ నాయక్ గారు కోరారు.