సాలూర సబ్‌స్టేషన్‌లో ట్రాన్స్‌ఫార్మర్ అప్‌గ్రేడ్ పనులు.. నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత.
బోధన్, జూలై 16 (జన సంఘర్షణ)
నేడు(16-07-2026) గురువారం 33/11 కె.వి. సాలూర సబ్‌స్టేషన్‌లో వినియోగదారులకు భవిష్యత్తులో నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రస్తుతం ఉన్న రెండు 5 MVA ట్రాన్స్‌ఫార్మర్లలో ఒక 5 MVA ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 8 MVA అధిక సామర్థ్యం గల ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నారు.ఈ పనుల కారణంగా సాలూర సబ్‌స్టేషన్ పరిధిలోని అన్ని ఫీడర్లు, అన్ని గ్రామాల్లో ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.విద్యుత్ వినియోగదారులు ఈ అసౌకర్యాన్ని గమనించి విద్యుత్ శాఖకు సహకరించాలని అసిస్టెంట్ ఇంజనీర్టౌ బోధన్ న్-2, కళ్యాణ్ కోరారు.