JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:38 pm Posted by : JANA SANGARSHANA

TWJF కూకట్పల్లి అధ్యక్షుడు ఎర్ర యాకన్న, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు లకు ఘనంగా సన్మానం

TWJF కూకట్పల్లి అధ్యక్షుడు ఎర్ర యాకన్న, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు లకు ఘనంగా సన్మానం

— శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలిపిన గుమ్మడి రాజలింగం ఫౌండేషన్, శ్రేష్ట ఐ క్లినిక్ అధినేత డాక్టర్ గుమ్మడి కిరణ్.

 

 

హైదరాబాద్ సిటీ, కూకట్పల్లి ప్రతినిధి అంజిబాబు, జూలై 28, (జన సంఘర్షణ):

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) కూకట్పల్లి నియోజకవర్గం అధ్యక్షులుగా ఎన్నికైన ఎర్ర యాకన్న, ప్రధాన కార్యదర్శిగా (జనరల్ సెక్రటరీ) నాగుల అంజిబాబులకు గుమ్మడి రాజలింగం ఫౌండేషన్, శ్రేష్ట ఐ క్లినిక్ అధినేత డాక్టర్ గుమ్మడి కిరణ్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసి శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ గుమ్మడి కిరణ్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు సమాజానికి సేవ చేసే దిశగా ఎర్ర యాకన్న సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించాలని ఆకాంక్షించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన మరింత కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా ఆయన జర్నలిజం రంగంలో చేస్తున్న సేవలను అందరూ ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అంశాలను ప్రజలకు నిజాయితీగా చేరవేస్తున్న జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి సీనియర్ జర్నలిస్ట్ పుట్టి నగేష్, అనిల్ కిషోర్,శివ, మహేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.