JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 23 August 2026, 11:08 am Posted by : JANA SANGARSHANA

అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

*అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు*

— కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన జర్నలిజం విద్యార్థులు.

 

 

 

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 22, (జన సంఘర్షణ):

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి సురవరం ప్రతాప రెడ్డి తెలుగు యూనివర్సిటీలో సీనియర్ జర్నలిస్టు కళ్యాణ్ దాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంజిబాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జర్నలిజం విద్యార్థిని, విద్యార్థులు అధ్యాపకులు శ్రేయోభిలాషులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ వారంలో జన్మదినోత్సవాలు జరుపుకున్న మిత్రులు ప్రదీప్, చాకలి హరీష్, అంతర్జాతీయ ఫోటోగ్రఫీ డేని పురస్కరించుకొని ఫోటో జర్నలిస్టులు నవీన్, పవన్ కుమార్ లను కూడా అభినందించి సత్కరించారు. అలాగే ఇటీవల కూకట్పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కూకట్పల్లి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన నాగుల అంజిబాబుని కూడ ఘనంగా సత్కరించి అభినందించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందుకు జర్నలిజం విద్యార్థులు హాజరై ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్టు మిత్రులు మ్యాకం రవికుమార్, జహంగీర్, ప్రముఖ హైకోర్టు న్యాయవాది, కవి, రచయిత కొండూరి కోటిబాబు, విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక అధ్యక్షురాలు చీకూరి లీలావతి, పర్ఫెక్ట్ అకాడమీ డాక్టర్ పసుపులేటి హరీష్, జర్నలిజం విద్యార్థులు ఎస్ నరేష్, శివ, నదియా, నరసప్ప, రాచూరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.