JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 10:22 pm Posted by : JANA SANGARSHANA

‘ఆంధ్రజ్యోతి’ ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరావుకి రాష్ట్ర స్థాయి అవార్డు

హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 16, (జన సంఘర్షణ):

తెలంగాణ స్టేట్ ఫోటోజర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్ ఫొటో కాంపిటీషన్-2026లో కూకట్పల్లి’ ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరావు రాష్ట్ర స్థాయి అవార్డును గెలుచుకున్నారు. పుట్ పాతులమీద విధివ్యాపారుల బ్రతుకులనూ ఎత్తిచూపుతూ ఆయన తీసిన ఫొటోకు ఈ గుర్తింపు లభించింది. ప్రజా సమస్యలను బ్రతుకు చిత్రాలను వెలుగులోకి తెచ్చి, ఎన్ని కష్టాలు పడైన పిల్లలను రాజుల్లా చేసుకునే తల్లి ప్రేమను వెలకట్టలేము అనే దానికి ఈ చిత్రం నిదర్శనం అని ఈ ఫోటో అవార్డుకు ఎంపిక అవ్వడం ఎంతో సంతృప్తినిస్తుందని నాగేశ్వరావు అన్నారు. సమాజానికి ఉపయోగపడే కథనాలకు మరింత ప్రాధాన్యమిస్తానని చెబుతూ నిర్వాహకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.