హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 15, (జన సంఘర్షణ):
కూకట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 15 నుండి ఆగస్టు 31 వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జర్నలిస్టులందరూ కొత్త సభ్యత్వంతో పాటు ఉమ్మడి ప్రెస్ క్లబ్ పునరుద్ధరణ (రెన్యువల్) చేసుకోవాలని నాయకులు సూచించారు. ఆసక్తి కలిగిన జర్నలిస్టులు 9063214441 నంబర్ కి సంప్రదించాలని కోరారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలోని జర్నలిస్టులందరూ సద్వినియోగం చేసుకోవాలని TWJF అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు ( జనరల్ సెక్రటరీ ) , కోశాధికారి మహమ్మద్ షబ్బీర్ తెలియజేశారు.