కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన టిడబ్ల్యూ జెఎఫ్ యూనియన్ నాయకులు
— నూతన కార్యవర్గ సభ్యులను అభినందించిన డీసీపీ.
హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి అంజిబాబు నాగుల, ఆగస్టు12 (జన సంఘర్షణ):
కూకట్పల్లి జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) రితీరాజ్ ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు కట్టెల మల్లేశం, జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్, కూకట్పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తూనే చట్టాన్ని ఉల్లంఘించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. నిషేధిత గుట్కా, గంజాయి విక్రయాలను అరికడతామని , దానితో పాటు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన, ఈ వ్ టీజింగ్ కు పాల్పడే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అదేవిధంగా ఆపద సమయంలో డయల్ 112 నెంబర్ కు ఫోన్ చేసి పోలీసుల సహాయాన్ని పొందాలని ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందజేయాలని డిసిపి మాట్లాడారు. ఈ సందర్బంగా టిడబ్ల్యూ జెఎఫ్ కూకట్పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య మాట్లాడుతూ కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ప్రస్తుతం తెలంగాణ పోలీస్ శాఖలో కఠినంగా విధులు నిర్వర్తించే అధికారిణిగా గుర్తింపు పొందారాని, ఆమె స్వస్థలం బీహార్ రాష్ట్రం పాట్నాలో పెరిగిన రితిరాజ్ ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారిణి అయిన రితిరాజ్ తెలంగాణ కేడర్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా పనిచేసిన సమయంలో ఎన్నికల సమయంలో శాంతిభద్రతల నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించారాని, పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో కూడా చురుకుగా వ్యవహరించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి టిడబ్ల్యూ జెఎఫ్ ప్రధాన కార్యదర్శి నాగుల అంజిబాబు ( జనరల్ సెక్రటరీ), ఉపాధ్యక్షులు బొమ్మ గోపి, కోశాధికారి మహమ్మద్ షబ్బీర్, కార్యవర్గ సభ్యులు శ్యాంసుందర్, నవీన్ కుమార్, సైదులు, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.