–ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఫొటోలకు అవార్డు.
హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు17, (జన సంఘర్షణ):
శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ కాలనీలో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్ ఫొటో కాంపిటీషన్-2026లో కూకట్పల్లి ఫోటో జర్నలిజం ప్రతిభ చూపిన దక్కన్ క్రానికల్ ఫోటో జర్నలిస్ట్ దుర్గారావు, నమస్తే తెలంగాణ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, ఆంధ్రజ్యోతి ఫోటో జర్నలిస్ట్ మాచర్ల నాగేశ్వరావుకి రాష్ట్ర స్థాయి అవార్డులు వరించిన సందర్భంగా సోమవారం రోజు కూకట్పల్లి ప్రెస్ క్లబ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, ప్రధాన కార్యదర్శి (జనరల్ సెక్రటరీ) నాగుల అంజిబాబు అభినందించి, శాలువాతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు యాకయ్య మాట్లాడుతూ పుట్ పాతుల మీద విధి వ్యాపారుల బ్రతుకులనూ ఎత్తిచూపుతూ తీసిన ఫొటోలకు ఈ గుర్తింపు లభించిందని, ప్రజా సమస్యలను బ్రతుకు చిత్రాలను వెలుగులోకి తెచ్చి, వాటి పరిష్కారానికి కృషి చేయడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సీనియర్ జర్నలిస్ట్ రామారావు, సూర్య దినపత్రిక ఫోటో జర్నలిస్ట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.