—ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఫొటోకు అవార్డు
హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 16, (జన సంఘర్షణ):
తెలంగాణ స్టేట్ ఫోటోజర్నలిస్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన న్యూస్ ఫొటో కాంపిటీషన్–2026లో కూకట్‌పల్లి నమస్తే తెలంగాణ ఫొటోజర్నలిస్ట్ గడ్డం శ్రవణ్ కుమార్ అవార్డు అందుకున్నారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా తీసిన ఫొటోకు ఈ అవార్డు దక్కింది.ఈ సందర్భంగా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఫొటోల రూపంలో వెలుగులోకి తీసుకురావడం, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేయడం ఎంతో సంతృప్తినిచ్చే విషయమన్నారు. జర్నలిజం ద్వారా ప్రజాసేవ చేసే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. తన కృషిని గుర్తించి అవార్డుతో సత్కరించిన తెలంగాణ స్టేట్ ఫోటోజర్నలిస్ట్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యలను కెమెరా కంటితో చూపిస్తూ, సమాజానికి ఉపయోగపడే కథనాలకు మరింత ప్రాధాన్యం ఇస్తానని శ్రవణ్ కుమార్ తెలియజేశారు.