హైదరాబాద్ సిటీ, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి అంజిబాబు నాగుల, ఆగస్టు 13, (జన సంఘర్షణ):
కూకట్పల్లి నియోజకవర్గం కెపిహెచ్బి కాలనీ రోడ్ నెంబర్ 1 కేపీహెచ్బి కమ్యూనిటీ హాల్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వట్టి ఉపేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు కేకు కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) కూకట్పల్లి అధ్యక్షులు ఎర్ర యాకయ్య హాజరై శాలువా, పూల బొకేతో ఘనంగా సన్మానించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి టిడబ్ల్యూ జేఎఫ్ ప్రధాన కార్యదర్శి అంజిబాబు నాగుల (జనరల్ సెక్రటరీ), కార్యవర్గ సభ్యులు సుజాత, సభ్యులు వీరన్న తదితరులు పాల్గొన్నారు.