JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 7:18 am Posted by : JANA SANGARSHANA

మిత్ర హిల్స్ పార్క్ ని అమ్మవద్దు అని వినూత్నంగా చేవెళ్ల ఎంపీ నిరసన కార్యక్రమం

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 24, (జన సంఘర్షణ):

హైదర్ నగర్ డివిజన్ లోని మిత్ర హిల్స్ కాలనీ లో ఉన్న ప్రభుత్వ భూమిని కాలనీ వాసులు పార్క్ లాగా ఉపయోగిస్తున్నారు. కానీ ఆ ప్రభుత్వ భూమిని వేలంపాట ద్వారా విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి వినూత్నంగా నిరసన తెలుపుతూ కింద పడుకొని మా అందరిని బొంద పెట్టి మీరు ఈ ప్రభుత్వ భూమిని వేలంవేసి అమ్ముకోండి అని విమర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్, ఓబీసీ రంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు సీతారామ రాజు, బీజేపీ హైదర్ నగర్ డివిజన్ నాయకులూ, మిత్ర హిల్స్ సొసైటీ ప్రెసిడెంట్ సుధాకర రెడ్డి, సొసైటీ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు అందరూ పాల్గొన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ హైదర్ నగర్ డివిజన్ నాయకులు కూడా ఈ ధర్నాలో పాల్గొని కాలనీ వాసులకు మద్దతు తెలిపారు.