JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 12:29 pm Posted by : JANA SANGARSHANA

‘ముందు దేశం.. తర్వాతే మనం’: ఇల్లందులో ఘనంగా జాతీయ సమైక్యత ప్రదర్శన

♦ ఇల్లందు మండలంలో ‘మాస్టర్ మైండ్స్’, ‘సరస్వతి విద్యాలయం’ ఆధ్వర్యంలో ఘనంగా తిరంగా ర్యాలీ

♦ దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకే తిరంగా ర్యాలీ: మండల అధ్యక్షులు భట్టు రమేష్ వ్యాఖ్యలు

♦ ర్యాలీలో సందడి చేసిన విద్యార్థులు.. పాల్గొన్న జిల్లా ఉపాధ్యక్షులు గోపి కృష్ణ

♦ విజయవంతమైన తిరంగా ర్యాలీ.. సహకరించిన పాఠశాల యాజమాన్యాలకు ధన్యవాదాలు తెలియజేసిన మండల అధ్యక్షులు భట్టు రమేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ‘మాస్టర్ మైండ్స్’ మరియు ‘సరస్వతి విద్యాలయం’ విద్యాసంస్థల ఉమ్మడి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు.

మండల అధ్యక్షులు భట్టు రమేష్ అధ్యక్షతన సాగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు మరియు నాయకులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ విశేష కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోపి కృష్ణ పాల్గొని, విద్యార్థులతో కలిసి ర్యాలీని ముందుకు నడిపిస్తూ కార్యక్రమంలో నూతనోత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భట్టు రమేష్ మాట్లాడుతూ, మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు, అమరవీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ స్మరించుకోవాలని కోరారు.

“ముందు దేశం.. తర్వాతే మనం” అనే గొప్ప భావనతో పాటు యువతలో, విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ఇటువంటి జాతీయ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని మండల అధ్యక్షులు భట్టు రమేష్ అభిప్రాయపడ్డారు.

ఈ తిరంగా ర్యాలీని దిగ్విజయం చేయడంలో కీలక పాత్ర పోషించిన ‘మాస్టర్ మైండ్స్’, ‘సరస్వతి విద్యాలయం’ అధ్యాపక బృందాలకు మరియు యాజమాన్యానికి మండల అధ్యక్షులు భట్టు రమేష్ ప్రత్యేక ಧన్యవాదాలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోపి కృష్ణ, మండల అధ్యక్షులు భట్టు రమేష్ లతో పాటు జిల్లా కార్యదర్శి మురళి కృష్ణ, కౌన్సిల్ మెంబర్ రాంచందర్, మండల ప్రధాన కార్యదర్శులు రాజేష్, మధు, ఉపాధ్యక్షులు శ్రీకాంత్, పవన్, వంశీ, బుచ్చయ్య, కృష్ణ, లక్ష్మీనర్సింహా తదితరులు పాల్గొన్నారు.