JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 24 August 2026, 7:37 am Posted by : JANA SANGARSHANA

సేతు మాధవరెడ్డి లేని లోటు తీరనిది… ఆకాంక్ష గ్రూప్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, ఆగస్టు 24, (జన సంఘర్షణ):

నేతు మాధవరెడ్డి లేని లోటు తీరనిదని పలువురు వక్తలు అన్నారు. వివేకానందనగర్‌ డివిజన్‌లోని Y2K స్టేషనరీ యాజమాన్యం నేతు మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన సంతాప దినాల్లో భాగంగా అల్విన్‌ కాలనీ సాయినగర్‌లోని రాజేశ్వరి వృద్ధుల ఆశ్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త సాయికుమార్, ఆకాంక్ష ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, ఆకాంక్ష గ్రూప్ అధినేత సి హెచ్ వి రామారావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు పాలు, పండ్లు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా మాధవరెడ్డి సేవలను గుర్తుచేసుకుని ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు రాజేశ్వరి, కూకట్‌పల్లి ప్రెస్‌క్లబ్‌ TWJF అధ్యక్షులు ఎర్ర యాకన్న, గోరంట్ల స్వాతి, మహాలక్ష్మి, బాలమురళి, కిషోర్, వెంకట్, మురళి, సంపూర్ణ టవర్స్ సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.