JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 11:51 am Posted by : JANA SANGARSHANA

ఇల్లందులో అద్భుతం: గోల్డెన్ ఫ్రేమ్స్ గణపతి లడ్డూలో ప్రత్యక్షమైన బొజ్జ గణపయ్య రూపం

భక్తులను మైమరిపిస్తున్న స్వామివారి ఆకృతి – గోల్డెన్ ఫ్రేమ్స్ వద్ద వెల్లివిరిసిన ఆధ్యాత్మిక సందడి

లడ్డూలో వినాయకుడి రూపం.. హర్షం వ్యక్తం చేసిన షాప్ నిర్వాహకుడు రాహుల్ నేత

ఇల్లందు పట్టణంలోని ప్రముఖ “గోల్డెన్ ఫ్రేమ్స్” షాప్‌లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం వద్ద ఒక అద్భుతమైన సన్నివేశం చోటుచేసుకుంది. గణపతి నైవేద్యంగా సమర్పించిన లడ్డూలో స్వయంగా ఆ విఘ్నేశ్వరుడి రూపమే తేటతెల్లంగా కనిపిస్తుండటంతో స్థానికులు, భక్తులు ఆశ్చర్యానందాలకు లోనవుతున్నారు. స్వామివారి లడ్డూలో స్పష్టంగా వినాయకుడి ఆకృతి ప్రతిఫలించడం దైవిక లీలగా భక్తులు భావిస్తున్నారు.

ఈ విశేషాన్ని తిలకించిన గోల్డెన్ ఫ్రేమ్స్ షాప్ నిర్వాహకుడు రాహుల్ నేత తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. బొజ్జ గణపయ్యే స్వయంగా తమ షాప్‌లో వెలసి, తమను ఆశీర్వదించినట్లుగా భావిస్తున్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. సాక్షాత్తు ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం లభించడం తమ పూర్వజన్మ సుకృతమని, పట్టణ ప్రజలందరికీ ఆయన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని రాహుల్ నేత ఆకాంక్షించారు.

ఈ వార్త ఇల్లందు పట్టణమంతటా వ్యాపించడంతో గోల్డెన్ ఫ్రేమ్స్ షాప్‌కు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తుతున్నారు. లడ్డూలో కొలువుదీరిన స్వామివారి రూపాన్ని కళ్లారా తిలకించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ పులకించిపోతున్నారు. దీంతో ఆ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొని, ‘జై గణేష్’ నినాదాలతో ప్రతిధ్వనిస్తోంది.