హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, సెప్టెంబర్ 04, (జన సంఘర్షణ):
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం విద్యార్థుల ఆధ్వర్యంలో రూపొందిన గురుదక్షిణ కవితా సంకలనం పుస్తకావిష్కరణ సభ నేడు జరగనుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది కవులు ఈ కవితా సంకలనంలో భాగస్వాములు అయ్యారు. గురువుల విశిష్టతను తెలియజేస్తూ అద్భుత కవితలను ఆవిష్కరించారు. అంజిబాబు ఫౌండేషన్ సహకారంతో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ బాచుపల్లి క్యాంపస్ లో ఈ పుస్తకావిష్కరణ జరగనుంది. వర్సిటీ వీసీ వెల్దండ నిత్యానందరావు విశిష్ట అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు, జర్నలిజం విభాగాధిపతి బిహెచ్. పద్మప్రియ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. కొండూరి కోటిబాబు, నాగుల అంజిబాబు, ఎస్. కళ్యాణ్ దాస్ ఈ కవితా సంకలనానికి సంపాదకులుగా వ్యవహరించారు. పుస్తకావిష్కరణకు ముందు గురుపూజోత్సవం సందర్భంగా జర్నలిజం అధ్యాపకులను విద్యార్థులు ఈ సందర్భంగా సత్కరించనున్నారు.