JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 09 September 2026, 7:31 am Posted by : JANA SANGARSHANA

కవి పురుషుడు కాళోజి

హైదరాబాద్ సిటీ ప్రతినిధి నాగుల అంజిబాబు, సెప్టెంబర్ 09, (జన సంఘర్షణ):

ప్రజలందరి గొడవను

తన గొడవగా

ప్రతిఘటించిన

కవితా నాయకుడతడు

 

చందస చాందసాలనురికంభమెక్కించి

మాతృభాష మాండలికమే

మా సాహిత్యం, సంపదలని

యాస పట్టంగట్టిన దిక్సూచతడు

 

చూసి ఊరకుండని

సాక్షీభూతుడుగుండక

సాహిత్య సాకిరేవుతో

మురికివదిల్చిన మానవుడు

 

ఓట్లకరువుతో పెత్తనాలు చచ్చు

గద్దె జారు కిటుకుజెప్పి

ఆదుకొనే అవకాశం హరిహరులకు లేదంటూ

హరిహరుడే మానవుడై

అవినిని కాపాడాలని

దిగులు పడని హితవాది

 

దొంగకూడా మనింటోడే

పరాయోడు లేడంటు

దుమారంగ ఉప్పెనగ

తిరుగుబాటు రావాలెని

నిర్భయలై గద్దెదింప

విప్లవాలు రావాలని

తెలంగాణా కావ్యక్షేత్రాన

గర్జించిన కవిపురుషుడు

(కాళోజీ నారాయణరావు జయంతి , తెలంగాణ భాషా దినోత్సవ సందర్భంగా)

– కొండూరి కోటిబాబు

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం, జర్నలిజం విద్యార్థి, హైదరాబాద్.