JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 11 September 2026, 8:27 pm Posted by : JANA SANGARSHANA

కేసముద్రం మండల డబ్ల్యూజేఐ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

జర్నలిస్టుల ఐక్యత, హక్కుల పరిరక్షణ, సంక్షేమమే లక్ష్యంగా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) పనిచేస్తోందని జిల్లా అడహాక్ కన్వీనర్ హనుమండ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ లో నిర్వహించిన సమావేశంలో డబ్ల్యూజేఐ కేసముద్రం మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మండల గౌరవ అధ్యక్షుడిగా కొత్తపల్లి రాములు ,మండల అధ్యక్షుడిగా మారేపాక జగన్, ఉపాధ్యక్షుడిగా బబు‌రి సతీష్, ప్రధాన కార్యదర్శిగా గంధం సతీష్, కోశాధికారిగా రాజేంద్ర చారి, సహాయ కార్యదర్శిగా బల్లాల కాశీనాథ్, కమిటీ సభ్యులు గంధసిరి యాకన్న లను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం మండల అధ్యక్షుడు మారేపాక జగన్,ప్రధాన కార్యదర్శిగా గంధం సతీష్ లను జిల్లా అడహాక్ కన్వీనర్ హనుమండ్ల రామకృష్ణారెడ్డి సభ్యులతో కలిసి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డబ్ల్యూజేఐ నిరంతరం అండగా నిలుస్తుందని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, భద్రత కోసం సంఘం రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, హెల్త్ కార్డులు, ఫీజు రాయితీలు తదితర ప్రయోజనాలు అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అందేలా కృషి చేస్తామని చెప్పారు.జర్నలిస్టులు ఐక్యంగా ఉండి తమ హక్కుల సాధన కోసం సంఘటితంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశం లో జిల్లా కమిటీ బాధ్యులు పల్లె శ్రీనివాస్, కొండి సాయికిరణ్, ఆలకుంట్ల శ్రీనివాస్ ,జగన్‌రెడ్డి పాల్గొన్నారు.