తొర్రూరు వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూజేఐ) తొర్రూరు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా అడహాక్ కన్వీనర్ హనుమండ్ల రామకృష్ణారెడ్డి, కో-కన్వీనర్ కొండి సాయికిరణ్, జిల్లా కమిటీ సభ్యుడు జగన్‌రెడ్డి హాజరయ్యారు.
మండల అధ్యక్షుడిగా నగబోయిన అశోక్, ఉపాధ్యక్షుడిగా కుంభం మహేష్, ప్రధాన కార్యదర్శిగా తండా హరీష్, కోశాధికారిగా భరత్, సహాయ కార్యదర్శిగా వీరన్న, సభ్యుడిగా అంకం సురేష్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా హనుమండ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ఆరోగ్య భద్రత, సంక్షేమ పథకాలు తదితర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.