JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 6:28 pm Posted by : JANA SANGARSHANA

పసిపాప వైద్య ఖర్చులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్‌ ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారికి అండగా ఎన్‌ఆర్‌ఐ కోనేరు శశాంక్

పోతంగల్‌, ప్రతినిధి/ సెప్టెంబర్‌ 28 (జనసంఘర్షణ):

ఇందూరు జిల్లా పోతంగల్‌ మండలం జల్లాపల్లి గ్రామానికి చెందిన మంద రాజు, శైలజ దంపతుల పసిపాప అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, ఎన్‌ఆర్‌ఐ కోనేరు శశాంక్‌ స్పందించారు. పాప వైద్య చికిత్సకు అవసరమైన ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం కోనేరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తల్లిదండ్రులకు ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా కోనేరు శశాంక్‌ మాట్లాడుతూ పాప ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటిస్తూ, పాపకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. పాప సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి వైద్య ఖర్చుల కోసం సహాయం అందించడం పట్ల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని పలువురు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కోటగిరి మండల అధ్యక్షులు వేముల నవీన్‌, రుద్రూర్‌ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ, సీనియర్‌ నాయకులు ప్రకాష్‌ పటేల్‌, నాయకులు అద్దం శంకర్‌ పటేల్‌, మంద మారుతి తదితరులు పాల్గొన్నారు.

పసిపాప త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని నాయకులు, కార్యకర్తలు ఆకాంక్షించారు.