JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 20 September 2026, 2:05 am Posted by : JANA SANGARSHANA

పొలంపల్లి తండా నాగయ్య గుంపులో ఘనంగా వినాయకుని అన్నదాన కార్యక్రమం

విలసిల్లుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పొలంపల్లి తండా నాగయ్య గుంపు గ్రామపంచాయతీ పరిధిలో శనివారం వినాయకుని అన్నదాన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా ప్రసాద వితరణ చేపట్టారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ముఖ్యఅతిథిగా హాజరై, అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో పాటు గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఇలాంటి సామాజిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు గ్రామ ప్రజలకు, సర్పంచ్‌కు ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ అన్నదాన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు బడావత్ విజయ్ కుమార్, ధరావత్ మునిరామ్, ధరావత్ భాస్కర్, మాలోత్ భావుసింగ్, మాలోత్ శంకర్, మాలోత్ లలిత, మూడ్ బుజ్జి, ధరావత్ సరిత, గుగోల్త్ చరణ్, ధరావత్ చరణ్, ధరావత్ సాయి సిద్ధు, ధరావత్ జామ్లా, ధరావత్ రాజు, ధరావత్ ఉమ్లా, గుగోలోత్ కోత్యా తదితరులు ముందుండి సమర్థవంతంగా నిర్వహించారు.

కార్యక్రమంలో తండా వాసులు, మహిళలు, యువకులు మరియు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి, వినాయకుని కృపకు పాత్రులయ్యారు. ఉత్సవ కమిటీ సభ్యుల కృషిని గ్రామస్థులు అభినందించారు.