JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 4:56 pm Posted by : JANA SANGARSHANA

ప్రమాదవశాత్తు తుపాకి పేలి ఆర్ఐ మృతి

 

* పుష్పగుచ్చo సమర్పించి నివాళులర్పించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ సిటీ / సెప్టెంబర్ 18 ( జన సంఘర్షణ )

నేడు నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు ఎన్.ఎస్.ఓ ( నైట్ సెక్యూరిటీ ఆఫీసర్) డ్యూటీ ముగించుకొని వచ్చిన తర్వాత ఉదయం సమయంలో ఆయుధం క్లీన్ చేసే సమయంలో ప్రమాదవశాత్తు మిస్ఫైర్ కావడం వల్లన రిజర్వ్ ఇన్స్పెక్టర్ హెచ్. సతీష్ (41) మరణించడం జరిగింది.

ఇట్టి సంఘటన స్థలాన్ని హుటాహుటిన నిజామాబాదు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, పర్యవేక్షించారు.

అనంతరం నిజామాబాదు ప్రభుత్వ హాస్పిటల్ లో పోస్టుమార్టం అనంతరం పోలీస్ కమీషనర్ గారు పుష్ప గుచ్చలు ఉంచి ఘనంగా నివాళులుఅర్పించారు.

ఈ సందర్భంగా నివాళులు అర్పించిన వారిలో అదనపు డీసీపీ అడ్మిన్ శుభం ప్రకాష్ , నిజామాబాదు ఏసిపి శ్రీ ప్రకాష్ , ఆర్మూర్ ఎసిపి వెంకటేశ్వర్ రెడ్డి , బోధన్ ఎసిపి శ్రీనివాసులు , ఏ.ఆర్ ఏ సి పి కృష్ణ స్వామి , సి.సి.ఎస్ ఏ సి పి శ్రీశైలం , టాస్క్ ఫోర్స్ ఎ.సి.పి నరేందర్ , సి.టి.సి ఎ సి పి రాజశేఖర్ , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి , మల్లేశం మరియు సిఐలు , రిజర్వ్ ఇన్స్పెక్టర్లు , ఎస్.ఐ లు , ఆర్ఎస్ఐలు , పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీను , యావత్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.

నివాళుల అనంతరము ప్రత్యేక అంబులెన్స్ లో తన స్వస్థలం అయినటువంటి ఇల్లెందు మండలం ఖమ్మం జిల్లాకు తరలించారు.