*చాక్లెట్ ఆశ చూపి తీసుకెళ్లినట్లు ఆరోపణలు.. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని పోలీసుల విజ్ఞప్తి*
నిజామాబాద్, సెప్టెంబర్ 05 (జన సంఘర్షణ): నిజామాబాద్‌లోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. బాలుడిని తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్న మహిళకు సంబంధించిన ఫొటోను పోలీసులు విడుదల చేశారు.
*బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.!!*. ఆసుపత్రిలో ఉన్న బాలుడికి చాక్లెట్ ఇస్తానంటూ ఓ మహిళ దగ్గరకు వెళ్లినట్లు, అనంతరం బాలుడు కనిపించకుండా పోయినట్లు తెలిపారు. దీంతో ఆ మహిళపైనే కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
*ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆసుపత్రి* పరిసరాల్లోని దృశ్యాలను పరిశీలిస్తూ బాలుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. అనుమానిత మహిళ ఫొటోను విడుదల చేసి ప్రజల సహకారం కోరారు.
ఫొటోలో ఉన్న మహిళ గురించి లేదా బాలుడి ఆచూకీకి సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.