* మంజూరైన గ్రామ సంఘాల భవనాలకు వెంటనే స్థలాలు కేటాయించండి
* మహిళా చట్టాల పై గ్రామస్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చెయ్యాలి
* ప్రజావాణిలో ఎంపీడీవోకు వినతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,చర్ల మండలం , సెప్టెంబర్ 28(జనసంఘర్షణ):
చర్ల మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మహిళా రక్షణ సంఘాo ఆధ్వర్యంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి,ఎంపీడీఓ కి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా రక్షణ సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్షులు చిట్టి మల్ల సుజాత మాట్లాడుతూ, మండలంలో మహిళల అభివృద్ధికి, ఆర్థిక చేయూతను అందించేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు,మండలంలో గ్రామ సంఘాల,విఓ,భవనాల కోసం ఇప్పటికే 13 భవనాలు శాంక్షన్ అయ్యాయని, ఒక్కో భవనానికి రూ. 10 లక్షల చొప్పున నిధులు కూడా మంజూరయ్యాయని ఆమె తెలిపారు. అయితే సరైన సమయంలో స్థలాలు కేటాయించకపోవడం వల్ల ఆ నిధులు నిరుపయోగంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రెవెన్యూ, పంచాయతీ రాజ్, ఎంపీడీవో అధికారులు అందరూ సమన్వయం చేసుకొని, వెంటనే తగిన స్థలాలను కేటాయించి ఈ భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆమె డిమాండి చేశారు. అదేవిధంగా మండలంలోని మహిళలకు ఉపాధి కోసం కుట్టు శిక్షణ అదేవిధంగా కంప్యూటర్ మొదలైనా ఉచిత శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి, బ్యాంకులు లేదా స్త్రీ నిధి ద్వారా తగిన ఆర్థిక సహాయం అందేలా చూసి మహిళల అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. అదేవిధంగా మహిళా చట్టాల పై గ్రామస్థాయిలో అవగాహన సదస్సు ఏర్పాటు చెయ్యాలి ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ సంఘం నాయకులు కే స్వరూప, వై వెంకటలక్ష్మి, యం సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.