JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 26 September 2026, 6:27 am Posted by : JANA SANGARSHANA

రాష్ట్రంలోనే ప్రత్యేకం ఇందూరు వినాయకుడి శోభాయాత్ర 

* జెండా ఊపి ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…

* దుబ్బ చౌరస్తా నుంచి వినాయకుల బావి వరకు రథం వెంట ఎమ్మెల్యే…

నిజామాబాద్ సిటీ. సెప్టెంబర్ 25. ( జన సంఘర్షణ )

ఇందూరు: రాష్ట్ర రాజధాని తర్వాత ఇందూరులోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతుందని, ఎంతో ఘన చరిత్ర ఉందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. నగరంలోని దుబ్బ చౌరస్తాలో శుక్రవారం రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వాతంత్ర ఉద్యమంలో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ ఇచ్చిన పిలుపుమేరకు ఇందూరులోనూ వినాయకుడి రథయాత్ర ప్రారంభించారని గుర్తు చేశారు. 21 జతల ఎడ్లతో అంగరంగ వైభవంగా శోభాయాత్ర నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ముందుకు సాగుతుందన్నారు. యువత భక్తమార్గంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని, ఇందుకు ఇందూరు యువతే నిదర్శనమన్నారు. వందేళ్లుగా రథం శోభాయాత్ర సాంప్రదాయం కొనసాగుతుందన్నారు. ప్రధానంగా నగరంలోని పలు కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు శోభాయాత్ర ఆధ్యాంతం సేవా కార్యక్రమాలు కొనసాగించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.