ఒకే బస్సుతో ఇబ్బందులు.. ఫుట్‌బోర్డుపై ప్రమాదకర ప్రయాణం చేస్తున్నామని ఆవేదనసా
లూర, సెప్టెంబర్ 30 (జనసంఘర్షణ)
సాలూర మండలం ఖాజాపూర్ గ్రామంలో అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. సుంకిని నుంచి హున్సా మీదుగా ఖాజాపూర్‌కు ఒకే బస్సు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
బస్సులో రద్దీ కారణంగా ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల ఆందోళనకు సర్పంచ్ చింతం నాగయ్య, బీజేపీ మండల అధ్యక్షుడు గంగాధర్ మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న బోధన్ రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి పరిస్థితిని సర్దిచెప్పారు. దీంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు.