* సిపిఐఏంమెల్ మాస్ లైన్ పార్టీ భద్రాచలం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,భద్రాచలం, సెప్టెంబర్ 28(జనసంఘర్షణ):
భగత్ సింగ్ 119వ జయంతి సందర్భంగా భద్రాచలం సిపిఐఎంల్ మాస్ లైన్ కార్యాలయంలో కామ్రేడ్ కేచ్చేల కల్పన అధ్యక్షతన జరిగిన సదస్సులో, కేచ్చేల రంగారెడ్డి పాల్గొని మాట్లాడుతూ,భగత్ సింగ్ స్వాతంత్ర పోరాటస్ఫూర్తితో, సామ్రాజ్య వాద వ్యతిరేక స్ఫూర్తితో, ప్రజలు ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. అమెరికా సామ్రాజ్యవాదం పలు స్వతంత్ర దేశాల మీద దాడులు చేయడానికి కాలుదవుతుందని బెదిరిస్తుందని ఆంక్షలు విధిస్తుందని ఆయన ఆరోపించారు. ఇప్పటికే ఇజ్రాయిల్ని ఆధారం చేసుకొని ప్రలస్తీనా ప్రజల మీద యుద్ధం ప్రకటించిందని మారణ హోమం సృష్టిస్తుందని జాతినే లేకుండా హతమార్చాలని ట్రంపు నాయకత్వంలో అమెరికా కోరుకుంటుందని ఆయన అన్నారు. ప్రపంచ పటం నుండి పాలిస్తీన లేకుండా చేయాలని కుట్ర పండుతున్నాడని ఆయన ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థలు గుర్తించిన దేశాలను అంతం చేసి కవరించాలని ప్రయత్నం చేయడం దుర్మార్గమని రంగారెడ్డి అన్నారు. అయినా ఆ ప్రజలు వెనకడుగు వేయకుండా వారి స్వతంత్రం కోసం తెగించి పోరాడుతున్నారని ఇది న్యాయమైన పోరాటమని దీన్ని ప్రపంచ ప్రజలంతా బలపరచాలని రంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పోరాటాలని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోవడం అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయిల్ చేస్తున్న దాడులను ఖండించకపోవడం అన్యాయమని ఆయన అన్నారు. ఇప్పటికైనా పాలస్తీనా ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాలను గుర్తించాలని ఇజ్రాయిల్ దాడులను ఖండించాలని ఆయన కోరారు. అలాగే క్యూబా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిలబడి స్వతంత్రంగా ఉండటం అనేది మంచి విషయం, ఇలాంటి దేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదం అంతమందించాలని కుట్రలుతుందని బెదిరిస్తుందని ఇలాంటి వాటిని ప్రపంచ దేశాలు భారతదేశంతో సహా ఖండించాల్సిన అవసరం ఉందని రంగారెడ్డి అన్నారు. అలాంటి దేశాలకు భారతదేశం మద్దతుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. భగత్ సింగ్ తన పోరాటంలో ఇంకిలాబ్ జిందాబాద్ నినాదంతో పాటు సామ్రాజ్యవాదం నశించాలని కూడా నిలదించాడు. అందుకని వారు త్యాగాలను స్ఫూర్తితో సామ్రాజ్యవాదం వ్యతిరేకంగా ప్రజలంతా ఐక్యంగా పోరాటాలు నిర్వహించాలని భగత్ సింగ్ కలలుగన్న దేశంలో స్వేచ్ఛ హక్కులు సాధించేంతవరకు అన్ని వర్గాల ప్రజలు సనసిద్ధంగా ఉండాలని రంగారెడ్డి పిలుపునిచ్చారు. ముందుకు పోవాలని కూడా అన్నారు. ఈ సదస్సులో
పిడిఎస్ యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మునిగేలా శివ ప్రశాంత్,
సిపిఐఎంల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు దాసరి సాయన్న, రైతు సంఘం డివిజన్ నాయకులు సున్నం వీరభద్రం మాట్లాడినారు.
ఈ సదస్సులో పాల్గొన్న వారు, కుమారి, శాంతక్క, ప్రణయ్, తదితరులు పాల్గొన్నారు.