JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 4:44 pm Posted by : JANA SANGARSHANA

అప్పాయిగూడెం గ్రామ పంచాయతీలో అమృత్ సరోవర్ చెరువు వద్ద ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం, రైతులకు ఎల్‌నీనోపై అవగాహన

 

కారేపల్లి ప్రతినిధి: (జన సంఘర్షణ) న్యూస్

అప్పాయిగూడెం, సింగరేణి మండలం, ఖమ్మం జిల్లా — 22 అక్టోబర్ 2026

భారత ప్రభుత్వం చేపట్టిన Special Campaign 6 కార్యక్రమంలో భాగంగా గురువారం అప్పాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని పెద్ద చెరువు “అమృత్ సరోవర్” వద్ద ఒకరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చెరువు పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత డ్రైవ్, స్వచ్ఛంద శ్రమదానం, మొక్కలు నాటడం, పరిసరాల అభివృద్ధి, నీటి వనరుల పునరుజ్జీవనం మరియు వాటి సమర్థవంతమైన నిర్వహణపై దృష్టి సారించారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణాన్ని కాపాడటంతో పాటు, నీటి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.

అదేవిధంగా, అప్పాయిగూడెం రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో ఎల్‌నీనో ప్రభావాలపై రైతులకు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నీనో ప్రభావాల వల్ల వాతావరణంలో వచ్చే మార్పులు, వ్యవసాయంపై వాటి ప్రభావం, సాగులో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న వ్యవసాయ సలహాలను పాటించడం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ రెండు కార్యక్రమాల్లో అప్పాయిగూడెం గ్రామ సర్పంచ్ శ్రీ దండు ప్రవీణ్ గారు, వ్యవసాయ అధికారి బట్టు అశోక్ కుమార్ గారు, EC సుధీర్ గారు, AEO మున్నీ గారు, వార్డు సభ్యులు కుంజా కృష్ణ ప్రసాద్ గారు, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

గ్రామంలో పర్యావరణ పరిరక్షణ, నీటి వనరుల సంరక్షణతో పాటు రైతులకు వ్యవసాయ సంబంధిత అవగాహన కల్పించే కార్యక్రమాలను కొనసాగించేందుకు గ్రామ పంచాయతీ కృషి చేస్తుందని సర్పంచ్ శ్రీ దండు ప్రవీణ్ గారు తెలిపారు.