JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 10:06 pm Posted by : JANA SANGARSHANA

అమ్మవారి ప్రతి పేరులోనూ ఒక జీవితం ఉంది.. ఒక సందేశం ఉంది

–మనిషి ఎలా బతకాలో చెప్పే ఒక అర్థం ఉంది.

–దుర్గామాత అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం.

 

హైదరాబాద్ సిటీ, కూకట్పల్లి ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 17, (జన సంఘర్షణ):

దేవీ శరన్నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్ పల్లి గ్రామంలో కొలువైన రామాలయం, కేపీహెచ్బీ 9వ ఫేజ్‌ లలో ఏర్పాటు చేసిన పలు మండపాలని సందర్శించి దుర్గామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం నిర్వహించినారు. అనంతరం కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సత్యం శ్రీరంగం మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న దేవీ శరన్నవరాత్రుల వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని నింపాయి అని అన్నారు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ అమ్మవారిని రోజుకొకరూపంలో అలంకరిస్తూ కొలుస్తారని, మన తెలంగాణ ప్రాంతంలో దసరా పండగ పెద్ద సంబురంగా జరుపుకుంటారన్నారు. నియోజకవర్గం ప్రజల క్షేమం కోరుతూ అమ్మవారిని ప్రార్ధించానన్నారు. అందరికి ముందుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ల అధ్యక్షులు కావేటి నాగార్జున, రాజేష్ శంకర్ గౌడ్, అరవింద్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్ష్యులు కృష్ణ రాజ్ పుత్, కొండల్ రెడ్డి, మల్లి యాదవ్, చైతన్య యాదవ్, అంజి రెడ్డి, పవన్, భార్గవ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు.