JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 11 October 2026, 11:02 pm Posted by : JANA SANGARSHANA

ఇల్లందులో ఆధ్యాత్మిక శోభ.. 24 ఏరియాలో అంబరాన్నంటిన శరన్నవరాత్రి ఉత్సవాలు

బాలా త్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ.. వైభవంగా ప్రారంభమైన ఉత్సవాలు

ఇల్లందు పట్టణంలోని 24 ఏరియాలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా మరియు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తుల గోవింద నామస్మరణలు, అమ్మవారి జయజయధ్వనుల మధ్య పండుగ వాతావరణం నెలకొంది.

తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి రూపం:

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు తొమ్మిది విభిన్న అవతారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల తొలిరోజైన ఆదివారం అమ్మవారు ‘శ్రీ బాలా త్రిపుర సుందరి’ అలకారంలో దర్శనమిచ్చారు. ఈ దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ప్రత్యేక పూజలు మరియు దర్శనాలు:

ఈ సందర్భంగా ఆలయంలో భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. పండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలను శ్రద్ధాసక్తులతో పూర్తిచేశారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు నిర్వాహకులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.