వర్ని / అక్టోబర్ 9 ( జన సంఘర్షణ )
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ కళాశాల పొలాస ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం (RAWEP)లో భాగంగా రైతులకు లింగ ఆకర్షణ బుట్టల (Pheromone Traps) వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా RAWEP విద్యార్థులు రైతులకు లింగ ఆకర్షణ బుట్టల ఉపయోగం, ఏర్పాటు చేసే విధానం, వాటి ద్వారా పంటల్లో పురుగుల ఉధృతిని గుర్తించే విధానం గురించి వివరించారు. లింగ ఆకర్షణ బుట్టల్లో ఉండే ఫెరోమోన్ ఆకర్షణ పదార్థం మగ పురుగులను ఆకర్షించి బంధిస్తుందని, తద్వారా పురుగు ఉధృతిని పర్యవేక్షించవచ్చని తెలిపారు.
పంటలో పురుగుల సంఖ్యను ముందుగానే గుర్తించడం ద్వారా అవసరమైన సమయంలో మాత్రమే సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చని విద్యార్థులు రైతులకు సూచించారు. దీనివల్ల అనవసరమైన పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని వివరించారు.
-
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా, రైతులు మరియు RAWEP విద్యార్థులు పాల్గొని లింగ ఆకర్షణ బుట్టల వినియోగంపై చర్చించారు. రైతులు ఈ పద్ధతి పట్ల ఆసక్తి చూపించి, పంటల్లో పురుగు నియంత్రణకు ఉపయోగకరంగా ఉంటుందని.. రఫ్ విద్యార్థులు.రు. అభినయ డి. అఖిల S. అర్చన P. జయశ్రీ B. నిహారిక J. నికిత P. పల్లవి వీరితోపాటు ఏఎంసి చైర్మన్ సురేష్ బాబా.. వరి ధాన్యాన్ని పంటల్ని పరిశీలిస్తున్నారు తెలిపారు.