*120 మంది మహిళలతో మహా కుంకుమార్చన.. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు..
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా/, అక్టోబర్ 19:/(జన సంఘర్షణ)
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కల్లూరు గ్రామంలో శ్రీ శాంభవి దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మహా దీపారాధన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించారు.
ఈ సందర్భంగా 120 మంది మహిళలతో మహా కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి, మహా దీపారాధన నిర్వహించారు. మహిళలు భక్తిశ్రద్ధలతో దీపాలను వెలిగించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు.
మహిళల భక్తిపారవశ్యంతో ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తుల సందడితో మహోత్సవం వైభవంగా సాగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ శాంభవి దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.