JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 8:23 pm Posted by : JANA SANGARSHANA

కూకట్‌పల్లి బతుకమ్మ సంబరాల్లో మూడో రోజు ప్రత్యేక ఆకర్షణగా మొలుగు స్పందన

 

కూకట్‌పల్లి ప్రతినిధి నాగుల అంజిబాబు, అక్టోబర్ 10, (జన సంఘర్షణ):

కూకట్‌పల్లిలో బతుకమ్మ సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు వేడుకల్లో మొలుగు స్పందన ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పాటలు పాడుతూ వేడుకల్లో పాల్గొంటున్నారు.తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలు కూకట్‌పల్లిలో పండుగ వాతావరణాన్ని నింపాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య కొనసాగిస్తున్నారు.