ఎంపీపీఎస్ రచ్చగల్లి పాఠశాలలో నూతన తరగతి గది ప్రారంభం.. విద్యార్థుల భవిష్యత్తు కోసం దాతల సేవాభావం
నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా బ్యూరో/అక్టోబర్ 5 (జన సంఘర్షణ): విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో దాతలు అందించిన సహకారం అభినందనీయంగా నిలిచింది. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ రచ్చగల్లి పాఠశాలలో దాతల విరాళాలతో నిర్మించిన నూతన తరగతి గదిని సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ఎపిక్ సిస్టమ్స్ ఇండియాస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో కలపాల విజయ్‌కుమార్, హెచ్‌ఆర్ లక్ష్మి, హోప్ ఫర్ లైఫ్ ఫౌండేషన్ హైదరాబాద్ ఫౌండర్ డాక్టర్ సీహెచ్ హిమజారెడ్డి, రవితేజ, రాజు తదితరులు హాజరై తరగతి గదిని ప్రారంభించారు.
*విద్యార్థుల సౌకర్యమే ప్రధాన లక్ష్యం!!!!*
ఈ సందర్భంగా సీఈవో కలపాల విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు సౌకర్యవంతంగా కూర్చొని చదువుకునేందుకు అవసరమైన తరగతి గది నిర్మాణానికి దాతలు సహకరించడం ఆనందంగా ఉందన్నారు. పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు, ప్రశాంతంగా చదువుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు కూడా ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తమ వంతు సహకారం అందించడం సంతృప్తినిస్తుందని తెలిపారు.
*ఒక తరగతి గది కేవలం నాలుగు గోడలు కాదు…..* విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే వేదిక అని పలువురు పేర్కొన్నారు. దాతల సహకారంతో పాఠశాలలో వసతులు మెరుగుపడటం విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బర్ల మధుకర్, ఎంపీడీవో జీ.విష్ణు, ఎంఈఓ నాదెండ్ల శ్రీనివాసరావు, హెచ్‌ఎం డీ.ఉదయ్‌చందర్, కులకర్ణి కృష్ణ, కొత్తపల్లి రమేష్, పార్వతి, మోహన్, గణేష్, శ్రావణ్, పీహెచ్‌ఎం ప్రభాకర్, బాబు, అశోక్, రిటైర్డ్ వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.