‘చలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమోక్రసీ’ కార్యక్రమంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ న్యూఢిల్లీ / అక్టోబర్ 12 / (జన సంఘర్షణ):
రాజ్యాంగ పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల సంరక్షణ, ప్రతి ఓటు హక్కును కాపాడే లక్ష్యంతో ఏఐసీసీ పిలుపు మేరకు న్యూఢిల్లీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మహా నిరసన కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు.
‘స్వాతంత్ర్య పోరాటం 2.0 – చలో ఢిల్లీ – మార్చ్ ఫర్ డెమోక్రసీ’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ తన నిరసనను వ్యక్తం చేసింది.
అనంతరం తెలంగాణ భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో భవిష్యత్తులో చేపట్టనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ కార్యక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు.
రాజ్యాంగాన్ని కాపాడుదాం.. ప్రతి ఓటు హక్కును పరిరక్షిద్దాం అనే నినాదంతో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ తన కార్యాచరణను కొనసాగించనున్నట్లు కార్యక్రమం ద్వారా స్పష్టం చేసింది.