డాక్టర్ ఎం.ఏ. హకీమ్ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో / అక్టోబర్ 9 / (జన సంఘర్షణ)
పోతంగల్: జిల్లా పల్లి ఫారం గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎజాజ్ జన్మదిన వేడుకలను పోతంగల్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, ప్రముఖ సామాజిక సేవకుడు డాక్టర్ ఎం.ఏ. హకీమ్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించి ఎజాజ్కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. పుట్టినరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేకమైన రోజని, అలాంటి రోజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల మధ్య ఆనందంగా జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. ఎజాజ్ ప్రజలకు మరింత సేవ చేస్తూ, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొని ఎజాజ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.