జిల్లా కార్యవర్గ సభ్యులుగా పలువురికి అవకాశం.. ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో / అక్టోబర్ 12 / (జన సంఘర్షణ):
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులను నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన పలువురికి జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించారు.
ఈ నియామకాల్లో భాగంగా పోతంగల్ మండలానికి చెందిన మక్కయ్య, నాగ్నాథ్, రుద్రూర్ మండలానికి చెందిన కటికే రామరాజు, వర్ని మండలానికి చెందిన ఇల్తెం శంకర్, మోస్రా మండలానికి చెందిన సుదర్శన్ గౌడ్, చందూర్ మండలానికి చెందిన బంటు సురేష్, నరెడ్ల నర్సింలు జిల్లా కార్యవర్గ సభ్యులుగా నియమితులయ్యారు.
జిల్లా కార్యవర్గ సభ్యుల నియామకాలకు సంబంధించి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఉత్తర్వులు విడుదల చేశారు.