సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ అక్టోబర్ 12 / (జన సంఘర్షణ):
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 అక్టోబర్ 7 నాటికి ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజా పాలనా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గందమల్ల ఆనంద్ గౌడ్ పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
,*బీజేపీ ఓబీసీ మోర్చా ఇందూరు జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి వేణుగోపాల్* ఆధ్వర్యంలో, దత్తత తీసుకున్న ప్రభుత్వ పాఠశాలలో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసి, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా పదాధికారులు ప్రకాష్ పాటిల్, ఒడ్డెన్న, గంగాధర్ యాదవ్, దిటీ రమేష్, ఆమదు కృష్ణ, మరెడ్డి సురేష్, బొబ్బిలి రమేష్, ఎన్. సాయిలు, పురాణ సాయిలు, ఆర్మూర్ ఒడ్డెన్న, ఓదెల్లా సతీష్, రాజ్ కుమార్, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి వేణుగోపాల్
అధ్యక్షుడు, బీజేపీ ఓబీసీ మోర్చా, నిజామాబాద్ అధ్యక్షుడు పేర్కొన్నారు.