JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 9:15 am Posted by : JANA SANGARSHANA

విద్యుత్ తీగలు తెగిపడి వ్యక్తి మృతి

* చర్ల మండలంలో విషాదకర ఘటన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, అక్టోబర్ 18(జనసంఘర్షణ):

చర్ల మండలంలోని, సి కత్తిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో,జి.పి. పల్లి గ్రామపరిధిలోని స్మశాన వాటిక సమీపంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ తీగలు తెగి పడటంతో పుచ్చ రవనయ్య అనే వ్యక్తి మృతి చెందాడు.

ఈఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుత్ తీగలు తెగిపడి ప్రమాదం జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విద్యుత్ శాఖ అధికారులు స్పందించి, ప్రమాదానికి గల కారణాలను పరిశీలించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.