సి ఎస్ పి బస్తీ గ్రామ పంచాయతీలో రేపు ‘పేసా’ గ్రామసభ
భూ ఆధారాలతో రేపటి ‘పేసా’ గ్రామసభకు హాజరుకావాలి: సి ఎస్ పి బస్తీ రైతులకు పిలుపు
సి ఎస్ పి బస్తీ గ్రామ పంచాయతీ పరిధిలోని 549 సర్వే నంబర్‌కు చెందిన 151.8517 హెక్టార్లు మరియు 17.5113 హెక్టార్ల అటవీ భూమిని సింగరేణి జెకె ఓపెన్ కాస్ట్ (JK OC) గనికి కేటాయించేందుకు గాను రేపు (ది. 09.10.2026, శుక్రవారం) ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక ‘పేసా’ గ్రామసభ నిర్వహించనున్నట్లు సర్పంచ్ మోకాళ్ళ లావణ్య తెలిపారు. సర్పంచ్ అధ్యక్షతన స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది. కావున సదరు భూములలో పట్టాలు మరియు హక్కులు కలిగి ఉన్న రైతులందరూ తగిన ఆధారాలతో, పత్రాలతో గ్రామసభకు తప్పకుండా హాజరుకావాలని ఈ సందర్భంగా సర్పంచ్ కోరారు.