JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 16 October 2026, 8:47 pm Posted by : JANA SANGARSHANA

సీతారామ ప్రాజెక్టు బాధిత రైతులకు ఎకరానికి 20 లక్షలా?

 

* మేము ఒప్పుకోం – చర్ల తహసిల్దార్ కు న్యూడెమోక్రసీ వినతి.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, అక్టోబర్ 15(జనసంఘర్షణ):

సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి కేవలం 20 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోందని, దీనికి తాము ఒప్పుకోమని చర్ల తహసిల్దార్ కి సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. సత్యనారాయణపురం గ్రామం రైతు వేదికలో అధికారులు ఏర్పాటు చేసిన రైతు సదస్సులో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ పాల్గొని మాట్లాడుతూ,

“చర్ల మండలం సత్యనారాయణపురం, ఆర్.కొత్తగూడెం, కుదునూరు, దేవరపల్లి గ్రామాలలో రైతులు సాగు చేసుకుంటున్న భూములకు కేవలం ఎకరానికి 20 లక్షలు ఇచ్చి ప్రభుత్వం, అధికారులు, పాలకులు చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు.

యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న ఈరోజు సీతారామ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్నాడు. భూములు కోల్పోతున్న రైతులకు ఎకరానికి 35 లక్షల నష్టపరిహారంతో పాటు, ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.

దుమ్ముగూడెం మండలంలో రైతులకు ఎకరానికి 30 లక్షలు ఇచ్చి, చర్ల మండలంలో మాత్రం 20 లక్షలు ఇవ్వడం ఏమిటి? ఈ వివక్షా విధానాన్ని మార్చుకోవాలి. లేకపోతే న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రైతులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని” హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ – ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ డివిజన్ నాయకులు గొంది ముయన్న , రైతులు తదితరులు పాల్గొన్నారు.