JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 12:35 pm Posted by : JANA SANGARSHANA

సెల్‌ఫోన్ విషయంలో గొడవ.. ఒకరు మృతి!

*మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ….. బండరాయితో దాడి*

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో / అక్టోబర్ 12 / (జన సంఘర్షణ):

నిజామాబాద్ నగరంలోని న్యూ ఎన్‌జీఓస్ కాలనీలో సెల్‌ఫోన్ విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఒకరు మృతి చెందారు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో జయంత్ తన స్నేహితుడు వినోద్‌పై బండరాయితో దాడి చేయడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

*3వ టౌన్ ఎస్సై హరిబాబు తెలిపిన వివరాల… ప్రకారం.!!!*. ఈ నెల 8న వినోద్, అతని స్నేహితుడు జయంత్ మధ్య సెల్‌ఫోన్ విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో జయంత్ బండరాయితో వినోద్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వినోద్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ వినోద్ మృతి చెందాడు.