JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 12 October 2026, 10:01 pm Posted by : JANA SANGARSHANA

హరీశ్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన పోతంగల్ మండల బీఆర్ఎస్ నాయకులు. ఎం.ఏ. హకీమ్

 

బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం.. ఎం.ఏ. హకీమ్ ధీమా

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ అక్టోబర్ 12 / (జనసంఘర్షణ):

*బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీశ్…!!!* రావును పోతంగల్ మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, పెద్దలు, సామాజిక సేవకుడు ఎం.ఏ. హకీమ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో పార్టీ పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై హరీశ్ రావుతో చర్చించారు.

*ఈ సందర్భంగా ఎం.ఏ.!!!* హకీమ్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలతో కలిసి కృషి చేస్తామని తెలిపారు. ప్రజలతో మమేకమవుతూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు.

*అలాగే, రాబోయే జెడ్పీటీసీ ఎన్నికల్లో..!!!* పోతంగల్ మండలంలో బీఆర్ఎస్ జెండా ఎగరేసేలా కృషి చేస్తామని హరీశ్ రావుకు వివరించినట్లు తెలిపారు. ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలిస్తే తాను జెడ్పీటీసీగా పోటీ చేయాలనే ఆలోచనను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

*ఈ మర్యాదపూర్వక భేటీ సందర్భంగా రాబోయే!!!* రోజుల్లో పార్టీ బలోపేతం, స్థానిక రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు తెలిపారు.