*మిషన్ భగీరథ నీరు వృథా.. ఇకనైనా స్పందించకపోతే తీవ్ర ఇబ్బందులు..!!!*
- నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల బ్యూరో/అక్టోబర్ 7: /(జన సంఘర్షణ)పోతంగల్ మండల కేంద్రంలో మిషన్ భగీరథ మంచినీటి పైప్లైన్ లీకేజీ ఏర్పడి సుమారు 25 రోజులు గడుస్తున్నా మరమ్మతులు చేపట్టకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
*బస్టాండ్ నుంచి కోటగిరి వెళ్లే ప్రధాన రహదారిలో…!!!!* పైప్లైన్ లీకేజీ కారణంగా ప్రతిరోజూ మంచినీరు వృథాగా రోడ్డుపై ప్రవహిస్తోంది. ఈ మార్గంలో నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.
*తాగునీటి వృథాను అరికట్టాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా…..!!!!*!*వ్యవహరించడం సరికాదని గ్రామస్తులు పేర్కొన్నారు. రానున్న వేసవిలో తాగునీటి అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే నీటి వృథాను అరికట్టాలని కోరారు.
*“ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా..!!!!* చూడాల్సిన బాధ్యత అధికారులదే. 25 రోజులుగా లీకేజీ కొనసాగుతున్నా పట్టించుకోకపోవడం బాధాకరం. ఇకనైనా వెంటనే మరమ్మతులు చేపట్టాలి. లేనిపక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి చర్యలు కోరుతాం” అని గ్రామస్తులు హెచ్చరించారు.
*మిషన్ భగీరథ అధికారులు…!!!* ఏఈ, డీఈలు వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి మంచినీటి వృథాను అరికట్టాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా నిరంతర నీటి సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.