JANA SANGARSHANA
Newspaper Banner
Date of Publish : 11 November 2026, 2:07 pm Posted by : JANA SANGARSHANA

వ్యవసాయ క్షేత్రంలో లభించిన జింకపిల్లను ఫారెస్ట్ అధికారులకు అప్పగింత..!

 

వన్యప్రాణుల సంరక్షణలో మానవత్వం చాటుకున్న బీఆర్ఎస్ నాయకుడు తేళ్ల రవికుమార్.. అభినందించిన స్థానికులు..!!

 

నిజామాబాద్ ఉమ్మడి జిల్లా బ్యూరో/ నవంబర్ 11 / జన సంఘర్షణ

 

వన్యప్రాణుల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల బాధ్యత, మూగజీవాల పట్ల మానవత్వం చాటుకుంటూ కోటగిరి మండలానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు తేళ్ల రవికుమార్ తన మంచి మనసును చాటుకున్నారు.

 

కోటగిరి మండల కేంద్రంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జింకపిల్ల కనిపించడంతో స్థానికులు ఈ విషయాన్ని తేళ్ల రవికుమార్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన జింకపిల్లకు ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుని, ఫారెస్ట్ అధికారులకు, కోటగిరి ఎస్సై శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగించారు.

 

అడవుల్లో స్వేచ్ఛగా సంచరించాల్సిన వన్యప్రాణులు అనుకోకుండా జనావాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన చాటిచెప్పారు. జంతువుల పట్ల దయ, ప్రకృతి పట్ల ప్రేమ, వన్యప్రాణుల సంరక్షణపై బాధ్యత కలిగి ఉండాలని ఆయన చేసిన ఈ చర్య పలువురి ప్రశంసలు అందుకుంది.

 

కేవలం రాజకీయ కార్యకలాపాలకే పరిమితం కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు మూగజీవాల సంరక్షణలోనూ ముందుండటం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో తేళ్ల రవి అన్న యువసేన సభ్యులు కమ్మరి మంజునాథ్, రుద్రంగి సందీప్, శివ, రఘువీర్, చిత్తరి సంజు, వడ్ల ఉమాకాంత్, గాండ్ల పవన్ తదితరులు పాల్గొన్నారు.

 

వన్యప్రాణులను రక్షించడం అంటే ప్రకృతిని రక్షించడమే అనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.