Homeతెలంగాణనిజామాబాద్ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ పై అధికారులకు ప్రత్యేక అవగాహన

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పై అధికారులకు ప్రత్యేక అవగాహన

📰 Generate e-Paper Clip

బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ పై మండల, నియోజకవర్గ స్థాయి అధికారులకు ప్రత్యేక అవగాహన, సమీక్ష సమావేశం నిర్వహించిన దిశానిర్దేశం చేసిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశపు హాలు లో బోధన్ నియోజకవర్గంలోని ఆయా మండల స్థాయి అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమావేశం నిర్వహించారు.నియోజకవర్గంలోని ఎడపల్లి, రెంజల్, నవీపేట్, సాలూర, బోధన్ మండలాలలో ఏయే సమస్యలు ఉన్నాయో అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.అంచనాలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఇంచార్జి ఆర్డీఓ నగేష్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular