Homeతెలంగాణఆ రెవెన్యూ కార్యాలయంలో ఆ ఔట్సోర్సింగ్ నీ ఉద్యోగి కలిస్తే పనులు అయిపోయినట్లే...

ఆ రెవెన్యూ కార్యాలయంలో ఆ ఔట్సోర్సింగ్ నీ ఉద్యోగి కలిస్తే పనులు అయిపోయినట్లే…

📰 Generate e-Paper Clip

*ఆ రెవెన్యూ కార్యాలయంలో ఆ ఔట్సోర్సింగ్. ఉద్యోగి కలిస్తే పనులు అయిపోయినట్లే…

 

జన సంఘర్షణ డెస్క్ . మార్చ్ 13 ( జనసంఘర్షణ )  : ఓ రెవెన్యూ కార్యాలయంలో తహసిల్దార్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా భారీగా ముడుపులు

అవినీతికి నిలయాలు అంటేనే రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్, విద్యుత్, పంచాయతీరాజ్, ఇరిగేషన్, రిజిస్టర్, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, ఆర్టీవో మారిపోయాయి. ఇటీవల ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతిని అడ్డుకట్ట వేయడానికి ఏసిబి అధికారులు సోదాలు చేస్తూ అవినీతి పాల్పడ్డ అధికారులు జైలుకు పంపిస్తున్నారు. ఈ ఏసీబీ నుంచి బయటపడడానికి కొంతమంది అధికారులు ఆ కార్యాలయంలో పనిచేసే ఔట్సోర్సింగ్ సిబ్బందిని లంచాల కోసం వాడుకుంటున్నారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగి శాశ్వత ఉద్యోగి కాకపోవడంతో ,ఉన్నత అధికారులు చెప్పిన దానికి తల ఊపుతూ, కార్యాలయాలకు వచ్చే ప్రజల నుంచి పెద్ద ఎత్తున లంచాలు దండుకుంటూ ఉన్నత అధికారులకు చెప్పిన చోటకు తీసుకువెళ్లి ఈ లంచాల డబ్బులు అప్పగిస్తున్నారు. దీనివల్ల అవినీతి అధికారులు ఏసీబీ కి చిక్కకుండా ఈ కొత్త పంత ఎంచుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గం నిజామాబాద్ జిల్లా లోని ఓ తాసిల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగికి ఏ పని కావాల్సిన అతని కలుస్తే పనులు అయిపోయినట్లే. ఇదేంటండి మీరు చెప్తున్నది ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కలిస్తే, ఆ రెవెన్యూ కార్యాలయంలో పనులు ఏ విధంగా జరుగుతాయని అని మీకు అనుమానం వచ్చింది కదా? మీరు అనుమానం పడుతున్నది వాస్తవమే. కానీ ఆ రెవెన్యూ కార్యాలయంలో, మాత్రం ఔట్సోర్సింగ్ ఉద్యోగి చెప్పిందే వేదం. ఏ పని కావాల్సిన ఆ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కలిస్తే, తాసిల్దార్ కు ఎన్ని ముడుపులు ముట్ట చెప్పాలి, ఎక్కడికి డబ్బులు తీసుకురావాలి? అన్ని వివరాలన్నీ ఆ ఉద్యోగి వచ్చే జనానికి వెల్లడిస్తారు. తహసిల్దార్ ఇవ్వవలసిన డబ్బులను ఆ ఉద్యోగి ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన డబ్బులను తీసుకొని రహస్య ప్రాంతాల్లో ,ఎవరికి తెలియకుండా ఆ తహసిల్దార్ కు బుట్ట చెబుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. తహసిల్దార్ కార్యాలయంలో ఏ పని కావాల్సిన ఔట్సోర్సింగ్ ఉద్యోగిని కలిస్తే ఇట్టే అయిపోతుంది. తాసిల్దార్ ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని కావాలని తన వద్ద పెట్టుకొని పనులు చేసుకుంటున్నారు. ఈ ఔట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా పెద్ద ఎత్తున ఆ రెవెన్యూ కార్యాలయంలో పని చేసే తాసిల్దార్ కు పెద్ద ఎత్తున లంచాలు దండుకుంటున్నారు. కార్యాలయంలో తీసుకుంటే ఏసీబీ వాళ్లకు చిక్కుతామని భయపడి ,ఔట్సోర్సింగ్ ఉద్యోగి ద్వారా

ప్రజల వద్ద నుంచి వసూళ్లు చేసిన లంచాలను తన ఇంట్లో పెట్టుకుని, అధికారి వెళ్లేటప్పుడు ఏదో ఒకచోట ఎవరు లేని సమయంలో అధికారికి అప్పగిస్తున్నారు. ఇదండీ ప్రభుత్వ కార్యాలయంలో కొనసాగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తుంటే, మరొక పక్క ఏసీబీకి చిక్కకుండా కొంతమంది ప్రభుత్వ ఉన్నత అధికారులు తమ చేతి కింద పనిచేసే కిందిస్థాయి సిబ్బంది చేతలంచాలు తీసుకోవడానికి వాడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular