Homeతెలంగాణనిజామాబాద్రేపు తెలంగాణ యూనివర్సిటీలో మెగా ఉద్యోగ మేళా

రేపు తెలంగాణ యూనివర్సిటీలో మెగా ఉద్యోగ మేళా

📰 Generate e-Paper Clip

 

రేపు తెలంగాణ యూనివర్సిటీలో మెగా ఉద్యోగ మేళా – యువత పెద్ద సంఖ్యలో పాల్గోనాలి  ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో రేపు (మార్చి 17, 2026) విశ్వవిద్యాలయం డిచ్‌పల్లి క్యాంపస్‌లో మెగా ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్లేస్మెంట్ డైరెక్టర్ సెల్ డాక్టర్ పాత నాగరాజు తెలిపారు. విద్యార్థులు మరియు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొంటున్నారు .వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ టి. యాదగిరి రావు మాట్లాడుతూ యువత తమ విద్యకు అనుగుణంగా మంచి ఉద్యోగాలను పొందేందుకు ఇటువంటి ఉద్యోగ మేళాలు ఉపయోగపడతాయని తెలిపారు. విశ్వవిద్యాలయం తరఫున యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. జిల్లాలోని డిగ్రీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ మరియు ఇతర కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాలో వివిధ రంగాలకు చెందిన పలు ప్రముఖ సంస్థలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయని తెలిపారు. యువత తమ అర్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలను పొందే అవకాశం ఉందన్నారు. ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా. పాత నాగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ Resume/Bio-data మరియు ఆధార్ కార్డు తీసుకుని ఉదయం 9 గంటల నుండి క్యాంపస్‌లో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ ఉద్యోగ మేళా Telangana University ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్ మరియు సంయుక్తంగా ఈ జాబ్ ఫెయిర్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. జిల్లాలోని అనుబంధ కళాశాలల విద్యార్థులు మరియు నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉద్యోగాలను పొందాలని విశ్వవిద్యాలయ అధికారులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular