Homeఇల్లందుముకుందాపురంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

ముకుందాపురంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి

📰 Generate e-Paper Clip

• ఆరుగురు అరెస్ట్, రూ.48 వేలు స్వాధీనం

ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకుందాపురం గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు అకస్మాత్తుగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 48,920 నగదుతో పాటు 5 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి చర్యల నిమిత్తం ఇల్లందు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, సబ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, సుమంత్, రామారావు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

- Advertisment -ads

Most Popular